Scholar, administrator, author, philosopher and
former vice-chancellor of
Sri Venkateswara University
ప్రముఖ తత్వవేత్త సచ్చిదానంద అస్తమయంతత్వశాస్త్రంపై 50 పుస్తకాలు, వందల వ్యాసాలూ ఆయన సొంతం
(Andhra jyothi, 25/01/2011)
గుంటూరు ఎడ్యుకేషన్, జనవరి 24 :భారతీయ తత్వశ్రాస్తానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి(87) పరమపదించారు. తత్వవేత్తగా 50కిపైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాసిన ఆయన సోమవారం గుంటూరులో కన్ను మూశారు. ఆయనకు భార్య వేదవతీదేవి, నలుగురు కుమారులున్నారు.
గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1924లో కొత్త వీరభద్రయ్య, రాజారత్నమ్మ దంపతులకు జన్మించిన సచ్చిదానందమూర్తి.. భారతీయ తత్వశ్రాస్తాన్ని విశ్వవ్యాప్తం చేశారు. దేశంలోని జేఎన్‌యూ(వారణాసి), హిందూ, బెనారస్ తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో సైతం సచ్చిదానంద సేవలు అందించటం తత్వశాస్త్రంలో ఈయన ప్రతిభకు నిదర్శనం. సచ్చిదానంద ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' బిరుదుతో ఆయనను సత్కరించింది. తత్వశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డును తొలి సారిగా 1982లో సచ్చిదానందకే ఇచ్చారు.
2007లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫిలాసఫికల్ రీసెర్చ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆయనకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. స్వామి ప్రణవానంద తత్వ శాస్త్ర జాతీయ బహుమతి, శృంగేరీ పీఠం అందించే విద్యాసాగర అవార్డు, కాశీ సంస్కృత విద్యాలయం ప్రదానం చేసిన వాచస్పతి తదితర అవార్డులనూ ఈయన పొందారు. 1995లో తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం 'మహామహోపాధ్యాయ' అనే అరుదైన గౌరవాన్ని సచ్చిదానందకు ఇచ్చి గౌరవించింది.
జర్మనీ, రష్యాలోని పలు సంస్థలు కూడా సచ్చిదానందకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ బిరుదులు ఇచ్చి సత్కరించాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి పేరిట ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆయన కీర్తికి నిదర్శనం. తత్వశాస్త్రంపై సచ్చిదానందమూర్తి 1952లో రాసిన 'ఎవల్యూషన్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా' అనే గ్రంథానికి ఎం.ఎన్.రాయ్ పీఠిక రాయడం విశేషం. కాగా.. సచ్చిదానందమూర్తి మరణంపై ప్రముఖ హేతువాది నరిశెట్టి ఇన్నయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
భారతీయ తత్వశాస్త్రం ఓ మహనీయుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సచ్చిదానంద మూర్తి మృతికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. వైస్ చాన్స్‌లర్‌గానూ, ఇతర రంగాల్లోనూ మూర్తి అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. మూర్తి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సచ్చిదానంద మూర్తి మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సర్వేపల్లి వారసుడు: భారతీయ తత్వశాస్త్ర నిపుణుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రథములైతే ఆయన వారసుడు ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి. ఈ విషయంలో దేశంలోని తత్వశాస్త్ర నిపుణులందరిదీ ఏకాభిప్రాయమే. సర్వేపల్లికి, సచ్చిదానందమూర్తికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. సర్వేపల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగం అధిపతిగా అయిదేళ్లపాటు పనిచేశారు. సచ్చిదానందమూర్తి ఆ విభాగంలో విద్యసభ్యసించి అక్కడే మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. రాధాకృష్ణన్ భారత ఉప రాష్ట్రపతి అయిన తరువాతే ఆయనతో పరిచయం జరిగింది. ఆయన పలుమార్లు ఢిల్లీకి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించేవారు. తత్వశాస్త్ర అధ్యయనంలో సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారు. పాఠశాల, కళాశాల విద్య అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ పూర్తి చేసి... పీహెచ్‌డీ అందుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొద్దికాలం అధ్యాపక వృత్తి స్వీకరించారు. తర్వాత ఆచార్యుడిగా మయూర్‌భంజ్‌లో పనిచేశారు. 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ యూనివర్శిటీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 1975-78 మధ్య పలు విద్యా విధానాలకు నాంది పలికారు. 1986-89 కాలంలో యూజీసీ ఉపాధ్యక్షుడిగా, సారనాథ్‌లోని విశ్వవిద్యాలయ స్థాయిగల సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్ సంస్థకు ఛాన్సలర్ హోదాలో1989-2001 వరకూ పనిచేశారు.
సీఎం సంతాపం
హైదరాబాద్, న్యూస్‌టుడే: యూజీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ తత్వశాస్త్ర ఆచార్యులు, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి కొత్త సచ్చిదానందమూర్తి మరణంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సంతాపం తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి: ఆచార్యులు సచ్చిదానందమూర్తి మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం విద్యారంగానికి తీరని లోటన్నారు. మూర్తి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జేపీ నివాళి: ఆచార్యులు కొత్త సచ్చిదానందమూర్తి మరణం పట్ల లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ సంతాపం ప్రకటించారు.
రాఘవులు సంతాపం: ఆచార్యులు మరణంపట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.
పలువురి నివాళి: సచ్చిదానందమూర్తి మృతికి అమెరికా నుంచి నరిశెట్టి ఇన్నయ్య సంతాపం వ్యక్తం చేశారు. తనతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఆయన మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. కుటుంబసభ్యులకు ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విద్యారంగానికి విశేష కృషి చేసిన సచ్చిదానంతమూర్తి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని విశాఖపట్నంలోని భారత తత్వశాస్త్ర పరిశోధన మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.రామకృష్ణారావు అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Former SV varsity VC passes away
TIMES NEWS NETWORK
Hyderabad: Scholar, administrator, author, philosopher and former vice-chancellor of Sri Venkateswara University (SV) Kotta Satchidananda Murty died on Monday after a prolonged illness.
Prof Murty, who has been suffering from severe lung infection, was undergoing treatment at St Joseph Hospital in Guntur. His condition deteriorated on Sunday night. He died on Monday morning. He was 86. Winner of several awards, Prof Murty was given the prestigious Padma Vibhushan award in 2001 and Pa d m a Bhushan in 1984. Prof Murty hailed from Sangam Jagarlamudi village in Guntur district.
He was a university professor of philosophy for a quarter century and was the first educationist to receive the coveted Dr B C Roy national award in philosophy in 1982. Prof Murty also served as vice-chairman of the University Grants Commission between 1986-89.
A recipient of honorary doctorates of a number of Indian universities, he was also a visiting professor of several foreign universities like the University of Halle-Wittenberg, Germany, the USSR Academy of Sciences, Sofia University, Bulgaria, Princeton University and the People’s University of China. He was also a honorary professor of Jawaharlal Nehru University, New Delhi, Banaras Hindu University, University of Hyderabad and Andhra University, Vizag.
He has to his credit about 50 books on philosophy, Buddhism and other subjects. He established a centre for studies on peace and non-violence. Since 1980, he was the chairman of the Indian Philosophical Congress and national fellow of the Indian Council of Philosophical Research.
Sources said after leaving SVU and taking residence again in AU, Murty had done exhaustive research on various dimensions of Buddhism. “His interest in Asian philosophies and religions is impeccable,” a former professor of AU recalled. “He was so good at exploring the highways and byways of Buddhist thought,” he added.
A professor from Nagarjuna University said as a teacher Murty had injected students with his own enthusiasm to build their intellect and future. “He used to organise seminars on world views and other interesting topics. By organising such seminars, Murty was doing what a professor should be doing, and what a university teacher should be doing,” he recalled.
Several professors, academicians and his peers condoled his death. Paying tributes, a AU professor said: “For men like Murty, the whole world is their field of study.”
(The Times of India, 25/01/2011)
Note: Click on image to view large image.
(Andhra jyothi, 25/01/2011)
Saakshi, 31/01/2011
Note: Click on image to view large image.
Satchidananda Murthy passes away
Kotha Satchidananda Murthy (87), former Vice-Chancellor of Sri Venkateswara University (1975-79) and Vice-Chairman of University Grants Commission (1986-89) died here on Monday after a brief illness.
Prof. Murthy was born at Sangam Jagarlamudi near Tenali on September 25, 1924. Besides being an active teacher and philosopher, Prof. Murthy distinguished himself as a policy maker in higher education and as an efficient administrator. He was conferred BC Roy National Award in 1984 Padmabhushan in 1984 and Padma Vibhushan in 2001. He was a prolific writer and authored more than 30 books in English, Telugu and Hindi. He is survived by four sons.
Chief Minister N. Kiran Kumar Reddy and other leaders condoled his death.
తత్వం ఆయన పంచప్రాణాలు
ప్రపంచ ఖ్యాతి తెచ్చిన సచ్చిదానందమూర్తి
తెనాలి, -న్యూస్‌టుడే : ఆచార్య సచ్చిదానందమూర్తి.. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఆటలు ఆడే వయసులో పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన నిత్యసోదకుడు. మాతృభాషతో పాటు సంస్కృతం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. అందరిలా కాక తన ఆలోచనలను తత్వశాస్త్రాల వైపు మళ్ళించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఎన్నో రచనలు చేశారు. టిబెట్ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. తెనాలి మండలం సంగంజార్లమూడికి చెందిన సచ్చిదానందమూర్తి సోమవారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సచ్చిదానందమూర్తి 1924లో రత్నాంబ, వీరభద్రయ్య దంపతులకు సంగంజాగర్లమూడిలో జన్మించారు.
బాల్యమిలా గడిచింది...: సంగంజాగర్లమూడిలో జన్మించిన సచ్చిదానందమూర్తి బాల్యం అందరిలా సరదాగా గడిచిపోలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొత్త విషయాలు అన్వేషించటంలోనే ఉండేవి. స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత గుంటూరు ఎ.సి. కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం (వాల్తేరు)లో డిగ్రీ పూర్తిచేశారు. తత్వశాస్త్రంలోనే కావటం దానిపై ఆయనకున్న ఆసక్తిని చూపుతుంది. 1956లో ఇక్కడే ఫిలాసపీలో పి.హెచ్.డి. పూర్తిచేశారు.
ప్రొఫెసర్ నుంచి అంతర్జాతీయ స్థాయికి: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తిచేసిన మూర్తి 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ స్వదేశానికి వచ్చి 1960లో తాను విద్యనభ్యసించిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. 1963లో బీజింగ్‌లోని చైనా పీపుల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేశారు. మద్యలో జె.ఎన్.టి.యు. ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏడేళ్లకే గుంటూరు యూనివర్శిటీ పి.జి. సెంటర్‌కు ప్రత్యేకాధికారిగా వచ్చారు. ఇక్కడ 1971 వరకు పనిచేసిన ఆయన జిల్లాలో కళాశాలల అభివృద్ధికి విశేష కృషిచేశారు. 1975 నుంచి నాలుగేళ్ల పాటు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. 1986లో విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ ఉపాధ్యక్షుడుగా, 1989 నుంచి సారనాధ్‌సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్‌కు కులపతిగా పనిచేశారు. అప్పుడే టిబెట్‌తో మంచి సంబంధాలేర్పడ్డాయి. తర్వాత విదేశాల్లో చాలాచోట్ల తత్వశాస్త్రంపై ప్రసంగాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్ దేశాల్లో పర్యటించారు. ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
టిబెట్‌తో అవినాభావ సంబంధాలు: టిబెట్‌తో సచ్చిదానందమూర్తికి మంచి సంబంధాలే ఉన్నాయి. 1989లోనే టిబెటన్ స్టడీస్ సెంటర్‌కు కులపతిగా పనిచేసిన రోజుల్లో అక్కడి వారితో అవినాభావ సంబంధమేర్పడింది. పలుమార్లు దలైలామాతో కలిసి పలు తత్వ విషయాలపై పరిశోధనాంశాలను చర్చించారు.
బిరుదులు ఎన్నెన్నో...: తత్వశాస్త్రం పై అనేక పరిశోధనలు, గ్రంథ రచనలు చేసిన సచ్చిదానందమూర్తికి అందిన బిరుదులు, పురస్కారాలు అంతే స్థాయిలో ఉన్నాయి. ఆయన రచించిన పుస్తకాలే ఎనలేని గుర్తింపు తెచ్చాయి. తెలుగులో 12 గ్రంథాలు, ఆప్రో, ఏషియన్ తత్వ శాస్త్రాలపైనా ఆంగ్లంలో 30 గ్రంథాలు రచించారు. ఈ తరహా కృషికే మొదటిసారి డాక్టర్ బి.సి.రాయ్ అవార్డు సచ్చిదానందమూర్తికి దక్కింది. ఈ అవార్డును 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసింది. తత్వ శాస్త్రంతో పాటు విద్వావిధానంలో సాధించిన ప్రగతికి 1984లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందాయి.
తత్వవేత్త, మార్గదర్శకులు సచ్చిదానందమూర్తి
ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: దివంగత ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గొప్ప తత్వవేత్త అని, అందరికీ మార్గదర్శకులని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.ఆర్.హరగోపాల్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాపసభలో హరగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆచార్యునిగా, ఉపకులపతిగా సచ్చిదానందమూర్తి ఎన్నో పదవులు నిర్వహించి అమూల్యమైన సేవలు అందించారన్నారు. యూజీసీ ఉపాధ్యక్షులుగా ఆయన దేశంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. నాగార్జున వర్సిటీతో సచ్చిదానందమూర్తికి ఎంతో అనుబంధం ఉందని, ఆయన సలహాలు, సూచనలు మరువలేనివని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఆయన పేరు మీద ఉన్న పరిశోధనా కేంద్రాన్ని బలోపేతం చేస్తామని, కేంద్రం సలహాసంఘాన్ని పునర్నియమిస్తామని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి రామకోటయ్య మాట్లాడుతూ సచ్చిదానందమూర్తి గొప్ప పరిపాలనా దక్షులని కొనియాడారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. సమానత్వం, శాంతి అనే సూత్రాలతో ఆయన పయనించారని వివరించారు. నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ దక్షిణామూర్తి మాట్లాడుతూ ఆయన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. రెక్టర్ వియన్నారావు మాట్లాడుతూ మూర్తి అందరికి ఆదర్శప్రాయుడన్నారు. రిజిస్ట్రార్ శర్మ మాట్లాడుతూ ఉన్నత విద్యాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారన్నారు. ఒఎస్‌డి శామ్యూల్, ఆచార్య సి.నరసింహారావు ఆయన గొప్పతనం గురించి వివరించారు. సచ్చిదానందమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అధ్యాపక సంఘం అధ్యక్షులు విష్ణువర్దన్, కార్యదర్శి రోశయ్య, వికాస అధ్యక్ష, కార్యదర్శులు బిట్రా సుబ్బారావు, యోబు, టీఎన్‌టీయూసీ కార్యదర్శి ఎం.మల్లేశ్వరరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి వర్సిటీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 27న సంగంజాగర్లమూడిలో సచ్చిదానందమూర్తి అంత్యక్రియలు సందర్భంగా గుంటూరు నుంచి విశ్వవిద్యాలయం బస్సు వేస్తుందని, సిబ్బంది హాజరుకావచ్చని హరగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
నిరంతర తాత్విక అధ్యయనశీలి సచ్చిదానంద
* నెమరువేసుకున్న ఏయూ తత్వశాస్త్ర ఆచార్యులు
ఆంధ్ర విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : గుంటూరులో సోమవారం మృతిచెందిన ప్రపంచ ప్రసిద్ధి తత్వవేత్త ఆచార్య సచ్చిదానందమూర్తిని ఆయన పనిచేసిన ఏయూ తత్వశాస్త్ర విభాగం జ్ఞప్తిచేసుకుంది. నిరాడంబరతకు, సహృదయతకు నిదర్శనం సచ్చిదానందమూర్తి అని ఈ విభాగ ఆచార్యులు అంటున్నారు. ఏయూ వీసీగా సర్వేపల్లి రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సచ్చిదానందమూర్తి ప్రతిభను గమనించి అధ్యాపక వృత్తిని ఇచ్చారన్నారు. 1984లో పదవీవిరమణ చేసిన ఆయన 35 ఏళ్లకుపైగా బాధ్యతలను నిర్వహించారు. మన దేశం నుంచి తత్వశాస్త్రం, వేదాంత బోధనలో సర్వేపల్లి తరువాత అంత కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు. ఒకే కోణంలో ఆలోచించకుండా విశ్వవ్యాప్త దృక్పథంతో ఆయన ఉపన్యాసాలు ఉంటాయని శిష్యుడు జార్జ్ విక్టర్ అన్నారు. విస్తృత అవగాహన, సమగ్ర అధ్యయనం విద్యకు ప్రాతిపదిక కావాలని భావించేవారన్నారు. విశాఖలో చివరిసారిగా సచ్చిదానందమూర్తి చేసిన ప్రసంగంలో 'ఆలోచనాపరులైన హిందువులు బైబిల్‌ను, క్రైస్తవులు భగవద్గీతను చదవాలని' అన్నారని గుర్తుచేసుకున్నారు. సచ్చిదానందమూర్తిపై పరిశోధన: సచ్చిదానందమూర్తి తత్వశాస్త్రానికి అందించిన సేవలపై ఆచార్య జార్జి విక్టర్ ఆధ్వర్యంలో డా.బి.బోయజ్ అనే అధ్యాపకుడు 2004లో పరిశోధన చేశారు. సచ్చిదానంద ఆంగ్లంలో 1947లో రాసిన హిందూ మతాభివృద్ధి, 1952లో రాసిన భారతదేశ తత్వశాస్త్ర పరిణామ క్రమంను ఇటీవల ఢిల్లీ పబ్లిషర్స్ కూడా ముద్రించారు. సచ్చిదానందమూర్తి పాఠం వినాలనే ఆసక్తితో ఆయన ప్రత్యేకంగా బోధించే చైనీస్, జపనీస్ బుద్ధిజం అంశాన్ని తాను తీసుకున్నానని ఆచార్య రజని గుర్తుచేసుకున్నారు. సచ్చిదానందకు భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని తత్వశాస్త్ర విభాగాధిపతి ఆచార్య వీర్రాజు అభిప్రాయపడ్డారు.
సచ్చిదానందమూర్తి సేవలు శ్లాఘనీయం
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌టుడే: ప్రముఖ తత్వవేత్త, ఎస్వీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి విద్యారంగానికి చేసిన సేవలు శ్లాఘనీయమని ఎస్వీయూ వీసీ ఎన్.ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాలులో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. ఎస్వీయూ అభివృద్ధికి సచ్చిదానంద మూర్తి చేసిన సేవలను కొనియాడారు. తత్వశాస్త్రంలో అమోఘ ప్రతిభను కనబరిచారన్నారు. ఈ సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసిందన్నారు. ఐసీపీఆర్ నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారని వెల్లడించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి ఎస్వీయూకు వీసీగా పనిచేయడం గర్వించదగ్గ విషయమన్నారు. తర్వాత సచ్చిదానందమూర్తి సేవలను రెక్టార్ కె.రత్నయ్య, రిజిస్ట్రార్ జె.ప్రతాప్‌రెడ్డి కొనియాడారు. అంతకు మునుపు తత్వశాస్త్ర విభాగంలో విభాగాధిపతి ప్రొఫెసర్ అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేసి ప్రొఫెసర్ మూర్తి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు జయంతరావు, సిద్ధయ్య, వెంకటేశ్వర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Note: Click on image to view large image.
సచ్చిదానందమూర్తి మరణం రాష్ట్రానికి తీరనిలోటు
నివాళులర్పించిన తెదేపా అధినేత చంద్రబాబు
కొత్తపేట, జనవరి 26 (న్యూస్‌టుడే): పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి (87) భౌతికకాయాన్ని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సందర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి శవాగారంలో భద్రపరిచిన సచ్చిదానందమూర్తి మృతదే హాన్ని బుధవారం మధ్యాహ్నం తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత అతని కుమారులతో మాట్లాడారు. సచ్చిదానందమూర్తితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చంద్రబాబు విలేకర్లతో చెప్పారు. శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం ఉపకులపతిగా ఆయన విధులు నిర్వర్తించే సమయంలో తాను విద్యార్థిగా ఉండేవాడినని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా సన్నిహిత సంబంధాలుండేవని అన్నారు. ఇండియా, చైనా, ఆక్స్‌ఫర్డ్‌లలోనూ మూర్తి పని చేశారని ఆయన అకాలమృతి తీరని లోటని వాపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కోడెల శివప్రసాద్‌రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫణిభూషణ్, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ యాస్మిన్, సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ ఎ.మోహన్‌కుమార్, రిటైర్డు డీఎస్పీలు వాసిరెడ్డి హనుమంతురావు, ఎ.సుందరయ్య, పలువురు వైద్యులు, తెదేపా నేతలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని కుమారులు మిత్రా, కృష్ణలు సంగంజాగర్లమూడిలోని నివాసానికి తీసుకెళ్ళారు. తూర్పు సీఐ జి.రామాంజనేయులు బందోబస్తును పర్యవేక్షించి, శవాగారం ఎదుట నిలిచిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Note: Click on image to view large image.
స్వగ్రామానికి సచ్చిదానందమూర్తి భౌతిక కాయం
గ్రామీణ తెనాలి, న్యూస్‌టుడే: ఆచార్య సచ్చిదానందమూర్తి భౌతిక కాయాన్ని బుధవారం స్వగ్రామం సంగంజాగర్లమూడికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు బంధువులు, స్నేహితుల సందర్శనార్ధం ఉంచారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ దంపతులు, రిటైర్డ్ డిఎస్పీలు కె.శ్రీనివాస్, కె.సుబ్బారావు, డాక్టర్ కొత్త రవీంద్రబాబు, ప్రముఖ వ్యాపారి జోగేంద్రదేవ్, సంజీవ్‌దేవ్ ఫౌండేషన్ సెక్రటరీ వై.వెంకటేశ్వరరావు, బాల్యమిత్రులు నారాయణస్వామి తదితరులు మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సచ్చిదానంద కుమారులు యశోమిత్ర, రఘునాధ్, కృష్ణలను పరామర్శించారు. అనంతరం స్వగృహంలో ఏర్పాటు చేసిన సచ్చిదానంద రచనల్ని, ఫొటో గ్యాలరీలను సందర్శించారు. నేడు అంత్యక్రియలు: సచ్చిదానంద అంత్యక్రియలు గురువారం ఉదయం 10 గంటలకు ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. ముగ్గురు కుమారులు స్థానికంగా ఉన్నా మరో కుమారుడు రమేష్ అమెరికా నుంచి రావాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చాక 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. అనంతరం గ్రామంలో సంతాపసభ ఏర్పాటు చేస్తారు.
విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలి: జేపీ
పద్మవిభూషణ్ సచ్చిదానందమూర్తికి ఘన నివాళి
హైదరాబాద్: ప్రస్తుతం విద్యాప్రమాణాలు దారుణంగా దిగాజారిపోయాయని.. ఉద్యోగం కోసమే డిగ్రీలు అన్నచందంగా విద్యార్థులు చదువుతున్నారని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. చదువుపై మమకారం జోడించేలా ఇప్పటికైనా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్విక చింతన లేని పరిజ్ఞానం, లోతులు లేని హంగులు కారణమని అన్నారు. కీలక స్థానాల్లో కుహన మేథావులతోఎంతో నష్టపోతున్నామన్నారు. ఇటీవల మరణించిన పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి సంస్మరణ సభ బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జేపీ మాట్లాడుతూ.. గత నలభై ఏళ్లలో తత్వశాస్త్రంలో పాండిత్యం, మేథో సంపత్తితో లోతైన, పదునైన ఆలోచనలు చేసినవారిలో కొత్త సచ్చిదానందమూర్తి అగ్రగాములని కీర్తించారు. ఆ రోజుల్లో విశ్వవిద్యాలయంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఉపకులపతి సచ్చిదానంద మూర్తి అని ఆచార్య సి.సుబ్బారావు అన్నారు. సినిమా దర్శకుడు చనిపోతే ప్రచార మాధ్యమాల్లో వచ్చే చర్చ.. గొప్ప తత్వవేత్త కాలం చేసినప్పుడు రాకపోవడం అంటే వారి కృషి ప్రజా బహుళ్యంలోకి వెళ్లేలా చెప్పకపోవడమే కారణమని డాక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. తాత్విక పేదరికం నుంచి బయటపడాలంటే వెయ్యేళ్లకోసారి పుట్టే ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి చర్చలు జరగాలని ఆకాంక్షించారు. వక్తలు ఆచార్య చలపతిరావు, ఆచార్య రఘురామరాజు, డాక్టర్ అనంత పద్మనాభరావు సచ్చిదానంద గొప్పతనాన్ని కొనియాడారు. ఆచార్య సి.వి.రాఘవులు సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. కార్యక్రమాన్ని రావెల సోమయ్య అధ్వర్యంలో నిర్వహించారు. ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్స్‌పల్ ఎం.నాగేశ్వరరావు, ఆచార్యులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
(Saakshi,3feb.2011)
A tribute to Professor Kotha Satchidananda Murthy
by Innaiah. N
Professor Kotha Satchidananda Murthy died on 24 Jan. 2011 in Guntur (Hyderabad).
He was an outstanding philosophy professor in Andhra University, Waltair, from where he wrote Evolution of Indian Philosophy. M.N. Roy contributed very lengthy introduction to that critical book which was later incorporated in his book Materialism. Prof Murthy later served as Vice Chancellor of Sri Venkateswara University, Tirupati, Nagarjuna University, where he developed a Buddhist Study Center. Prof Murthy was also Vice-Chairman of UGC. He toured extensively and lectured in famous universities on philosophy and thought. He published several books in English. Prof Murthy wrote introduction to essays of A.B Shah published by N. Innaiah (in Telugu) during 1968. He was a close associate of Justice Avula Sambasivarao, Chairman of Indian Radical Humanist Association. Many students were trained by Prof Murthy in Budhism and Logic. Source: N. Innaiah
కొత్త సచ్చిదానందమూర్తి
వికీపీడియా నుండి
కొత్త సచ్చిదానందమూర్తి
కొత్త సచ్చిదానందమూర్తి (ఆంగ్లం: Kotha Satchidananda Murty) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు[1]. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి( 87). తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు. ఆయన భార్య వేదవతీదేవి. నలుగురు కుమారులున్నారు.
విషయ సూచిక[దాచు] |
[మార్చు]బాల్యం
గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1924లో కొత్త వీరభద్రయ్య, రాజరత్నమ్మ దంపతులకు జన్మించిన సచ్చిదానందమూర్తి భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారు. దేశంలోని జే ఎన్ టి యూ, వారణాసి హిందూ విశ్వవిద్యాలయము, తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలతో పాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో సైతం సచ్చిదానంద సేవలు అందించటం తత్వశాస్త్రంలో ఈయన ప్రతిభకు నిదర్శనం. సచ్చిదానంద ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' బిరుదుతో ఆయనను సత్కరించింది. తత్వశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డును తొలి సారిగా 1982లో సచ్చిదానందకే ఇచ్చారు.
2007లో భారత తత్వశాస్త్ర పరిశోధనా సంస్థానము రజతోత్సవం సందర్భంగా ఆయనకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. స్వామి ప్రణవానంద తత్వ శాస్త్ర జాతీయ బహుమతి, శృంగేరీ పీఠం అందించే విద్యాసాగర అవార్డు, కాశీ సంస్కృత విద్యాలయం ప్రదానం చేసిన వాచస్పతి తదితర అవార్డులనూ ఈయన పొందారు. 1995లో తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం 'మహామహోపాధ్యాయ' అనే అరుదైన గౌరవాన్ని సచ్చిదానందకు ఇచ్చి గౌరవించింది.
జర్మనీ, రష్యాలోని పలు సంస్థలు కూడా సచ్చిదానందకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ బిరుదులు ఇచ్చి సత్కరించాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి పేరిట "ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ" పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆయన కీర్తికి నిదర్శనం. తత్వశాస్త్రంపై సచ్చిదానందమూర్తి 1952లో రాసిన 'ఎవల్యూషన్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా' అనే గ్రంథానికి ఎం. ఎన్. రాయ్ పీఠిక రాయడం విశేషం.
సర్వేపల్లి వారసుడు: భారతీయ తత్వశాస్త్ర నిపుణుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రథములైతే ఆయన వారసుడు ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి. ఈ విషయంలో దేశంలోని తత్వశాస్త్ర నిపుణులందరిదీ ఏకాభిప్రాయమే. సర్వేపల్లికి, సచ్చిదానందమూర్తికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. సర్వేపల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగం అధిపతిగా అయిదేళ్లపాటు పనిచేశారు. సచ్చిదానందమూర్తి ఆ విభాగంలో విద్యసభ్యసించి అక్కడే మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. రాధాకృష్ణన్ భారత ఉప రాష్ట్రపతి అయిన తరువాతే ఆయనతో పరిచయం జరిగింది. ఆయన పలుమార్లు ఢిల్లీకి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించేవారు. తత్వశాస్త్ర అధ్యయనంలో సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారు. పాఠశాల, కళాశాల విద్య అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ పూర్తి చేసి, పీహెచ్‌డీ అందుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొద్దికాలం అధ్యాపక వృత్తి స్వీకరించారు. తర్వాత ఆచార్యుడిగా మయూర్‌భంజ్‌లో పనిచేశారు. 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ యూనివర్శిటీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 1975-78 మధ్య పలు విద్యా విధానాలకు నాంది పలికారు. 1986-89 కాలంలో యూజీసీ ఉపాధ్యక్షుడిగా, సారనాథ్‌లోని విశ్వవిద్యాలయ స్థాయిగల సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్ సంస్థకు ఛాన్సలర్ హోదాలో1989-2001 వరకూ పనిచేశారు.
ఆచార్య సచ్చిదానందమూర్తి వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఆటలు ఆడే వయసులో పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన నిత్యసోదకుడు. మాతృభాషతో పాటు సంస్కృతం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. అందరిలా కాక తన ఆలోచనలను తత్వశాస్త్రాల వైపు మళ్ళించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఎన్నో రచనలు చేశారు. టిబెట్ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. తెనాలి మండలం సంగంజార్లమూడికి చెందిన సచ్చిదానందమూర్తి 1924లో రత్నాంబ, వీరభద్రయ్య దంపతులకు సంగంజాగర్లమూడిలో జన్మించారు.
బాల్యం: సంగంజాగర్లమూడిలో జన్మించిన సచ్చిదానందమూర్తి బాల్యం అందరిలా సరదాగా గడిచిపోలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొత్త విషయాలు అన్వేషించటంలోనే ఉండేవి. స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం (వాల్తేరు)లో డిగ్రీ పూర్తిచేశారు. తత్వశాస్త్రంలోనే కావటం దానిపై ఆయనకున్న ఆసక్తిని చూపుతుంది. 1956లో ఇక్కడే తత్వశాస్త్రంలో పి.హెచ్.డి. పూర్తిచేశారు.
ప్రొఫెసర్ నుంచి అంతర్జాతీయ స్థాయికి: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తిచేసిన మూర్తి 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ స్వదేశానికి వచ్చి 1960లో తాను విద్యనభ్యసించిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆచార్యునిగా చేరారు. 1963లో బీజింగ్‌లోని చైనా పీపుల్స్ విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేశారు. మద్యలో జె.ఎన్.టి.యు. ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏడేళ్లకే గుంటూరు యూనివర్శిటీ పి.జి. సెంటర్‌కు ప్రత్యేకాధికారిగా వచ్చారు. ఇక్కడ 1971 వరకు పనిచేసిన ఆయన జిల్లాలో కళాశాలల అభివృద్ధికి విశేష కృషిచేశారు. 1975 నుంచి నాలుగేళ్ల పాటు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. 1986లో విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ ఉపాధ్యక్షుడుగా, 1989 నుంచి సారనాధ్‌సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్‌కు కులపతిగా పనిచేశారు. అప్పుడే టిబెట్‌తో మంచి సంబంధాలేర్పడ్డాయి. తర్వాత విదేశాల్లో చాలాచోట్ల తత్వశాస్త్రంపై ప్రసంగాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్ దేశాల్లో పర్యటించారు. ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
టిబెట్‌తో అవినాభావ సంబంధాలు: టిబెట్‌తో సచ్చిదానందమూర్తికి మంచి సంబంధాలే ఉన్నాయి. 1989లోనే టిబెటన్ స్టడీస్ సెంటర్‌కు కులపతిగా పనిచేసిన రోజుల్లో అక్కడి వారితో అవినాభావ సంబంధమేర్పడింది. పలుమార్లు దలైలామాతో కలిసి పలు తత్వ విషయాలపై పరిశోధనాంశాలను చర్చించారు.
బిరుదులు: తత్వశాస్త్రం పై అనేక పరిశోధనలు, గ్రంథ రచనలు చేసిన సచ్చిదానందమూర్తికి అందిన బిరుదులు, పురస్కారాలు అంతే స్థాయిలో ఉన్నాయి. ఆయన రచించిన పుస్తకాలే ఎనలేని గుర్తింపు తెచ్చాయి. తెలుగులో 12 గ్రంథాలు, ఆప్రో, ఏషియన్ తత్వ శాస్త్రాలపైనా ఆంగ్లంలో 30 గ్రంథాలు రచించారు. ఈ తరహా కృషికే మొదటిసారి డాక్టర్ బి.సి.రాయ్ అవార్డు సచ్చిదానందమూర్తికి దక్కింది. ఈ అవార్డును 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసింది. తత్వ శాస్త్రంతో పాటు విద్వావిధానంలో సాధించిన ప్రగతికి 1984లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందాయి.
[మార్చు]పదవులు, పురస్కారములు
- ఉపాధ్యక్షుడు- యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్
- అధ్యక్షుడు - ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్
- దాక్టర్ ఫిలసాఫియే హానోరిస్ కాసా- రష్యా అకాడెమీ ఆఫ్ సైన్సెస్ - 1989
- ఛైనా విశ్వవిద్యాలయము, బీజింగ్- తత్వశాస్త్రములో గౌరవ పట్టా- 1988
- బి. సి. రాయ్ పురస్కారము
- పద్మ విభూషణ్ - భారత ప్రభుత్వము -2001
[మార్చు]రచనలు
[మార్చు]మూలాలు
- ↑ నాగార్జున: Murty, K. Satchidananda. 1971. Nagarjuna. National Book Trust, New Delhi. 2nd edition: 1978
[మార్చు]బయటి లింకులు
http://kottasatchidanandamurthy.blogspot.com/నిరాడంబరత సహృదయతకు మారుపేరైన సచ్చిదానందులవారి స్వహస్తంతో వ్రాసిన ముత్యాల్లాంటి అక్షరాలతో ఉన్న ఒక పోస్ట్ కార్డ్.. .
...............................................................................................................................
K Satchidananda Murty's featured books:
1. The Divine Peacock: Understanding Contemporary India
by Amit DasGupta (Editor), Indian Council for Cultural Relations, K. Satchidananda Murty (Editor)
Compilation of papers presented to the International Symposium on India Studies held at Kovalam, India, Nov. 28-Dec. 2, 1994.
2. Vedic Hermeneutics =
by K. Satchidananda Murty
3. Radhakrishnan-Life Ideas: His Life and Ideas
by K Satchidananda Murty
4. Current Trends in Indian Philosophy
by Suyin Rama-Krishna Han, K Satchidananda Murty
5. Radhakrishnan: His Life and Ideas
by K Satchidananda Murty
6. Philosophy in India: Traditions, Teaching, and Research
by K. Satchidanada Mutry, K. Satchidananda Murty
7. Readings in Indian history, politics and philosophy
by K. Satchidananda Murty
8. The perennial tree : select papers for the International Symposium on Indian Studies
by K. Satchidananda Murty, Amit Dasgupta, Indian Council for Cultural Relations
9. Ethics, Education, Indian Unity and Culture: Addresses in Universities from Kashi to Kashmir, 1980-89 - Some Excerpts
by K.Satchidananda Murty
10. The realm of between : lectures on the philosophy of religion
by K. Satchidananda Murty
11. Freedom, progress and society : essays in honour of Professor K. Satchidananda Murty
by R. Balasubramanian, Sibajiban Bhattacharyya, K. Satchidananda Murty
12. Hinduism & its development
by K. Satchidananda Murty
&Many more